పార్టీ పిలుపునిస్తే ముందుంటాం
ABN , Publish Date - May 29 , 2026 | 11:25 PM
పార్టీ ఏ పిలుపునిచ్చినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముందుంటారని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. వర్చ్యువల్‌గా జరిగిన మహానాడు కార్యక్రమం విజయవంతం కావడంపై ఆమె శుక్రవారం మండలంలోని వెంకటాపురం క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
రామగిరి, మే 29(ఆంద్రజ్యోతి): పార్టీ ఏ పిలుపునిచ్చినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముందుంటారని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. వర్చ్యువల్‌గా జరిగిన మహానాడు కార్యక్రమం విజయవంతం కావడంపై ఆమె శుక్రవారం మండలంలోని వెంకటాపురం క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మహానాడులో రాష్ట్రంలోనే రాప్తాడు 5వ స్థానంలో నిలవడంపై ఆమె హర్షం వ్యక్తంచేశారు. తరలివచ్చిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. 10 రోజుల నుంచి క్లస్టర్‌స్థాయిలో నాయకులందరూ కష్టపడ్డారని కితాబిచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా అధిష్ఠానం పిలుపునిచ్చిందంటే నియోజకవర్గంలో శ్రేణులు ఇలాగే స్పందిస్తారన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పనిచేద్దామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపునకు ఇప్పటి నుంచే కృషిచేయాలని ఆమె సూచించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కుంటిమద్దిరంగయ్య, మండల కన్వీనర్ సుధాకర్, మాజీ ఎంపీపీ పరంధామ యాదవ్, శంకర్ పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే: ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే ప్రయాణం చేశారు. ఎగువపల్లిలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన ఆమె తిరుగు ప్రయాణంలో స్వగ్రామం వెంకటాపురానికి ఆర్టీసీ బస్సులో వచ్చారు. బస్సులో మహిళలతో ఆమె స్ర్తీశక్తి గురించి ఆరాతీశారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు.