Share News

రైతుల అవసరం మేరకు విత్తనకాయలు అందిస్తాం

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:01 AM

రైతుల అవసరం మేరకు ఎంత విత్తనమైన అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మె ల్యే పరిటాలసునీత అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం వద్ద ఆమె విత్తన వేరుశనగ పంపిణీని ప్రారంబించారు.

రైతుల అవసరం మేరకు విత్తనకాయలు అందిస్తాం
MLA Sunita distributing seed peanuts to the farmers

రామగిరి, జూన 13(ఆంధ్రజ్యోతి): రైతుల అవసరం మేరకు ఎంత విత్తనమైన అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మె ల్యే పరిటాలసునీత అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం వద్ద ఆమె విత్తన వేరుశనగ పంపిణీని ప్రారంబించారు. వ్యవసాయశాఖ అధికారులు, రైతులు, టీడీపీ నాయకులతో కలిసి ఆమె కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ రైతులకు అం దించే సబ్సిడీ విత్తనాన్ని ఎవరైనా ఎవరైనా పక్కదారిపట్టిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గానికి 13వేల క్వింటాళ్ల కా యలు కేటాయించగా ప్రస్తుతం 5వేల క్వింటాళ్ల వరకు స్టాకు వచ్చిందన్నారు. ఒక్కో రైతుకు ప్రభుత్వం రూ.3,672 సబ్సిడీ అందిస్తోందన్నారు. రైతులు విత్తనకాయల నాణ్యతను పరిశీలించి తీసుకోవాలన్నారు. నా ణ్యత ఎక్కడ బాగాలేకపోయిన వెంటనే వెనక్కి ఇవ్వాలని సూచించా రు. రైతులు వేరుశనగతో పాటు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలన్నారు. ప్రస్తుతం వరిపంట స్థానంలో ఎక్కువ మంది నవధాన్యాలను తింటున్నారని, ఆరోగ్యపరంగా వీటిప్రాధాన్యం పెరిగిందన్నారు.

చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: చిన్న సమస్యలు అధికారులు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. మండల నాయకులతో కలిసి ప్రజల నుంచి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పింఛనలు, రేషనకార్డులు, ఇళ్లపట్టాలు, విద్యుత సమస్యలు తదితర వాటిపై అర్జీలు ఇచ్చారు.తీసుకున్న అర్జీలను వెంటనే పరిష్కరించేలా చర్యలుతీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమెగ్రామంలోని టీడీపీ కార్యకర్త ముత్యాలప్ప అనారోగ్యానికి గురికాగా ఆయనను పరామర్శించి రూ.15వేలు ఆర్థిక సాయం అందజేశారు. రంగయ్య, రామ్మూర్తినాయుడు, సుధాకర, సాయిలీల, శ్రీధర్‌నాయుడు, శివకుమార్‌, అక్కులప్ప, పేపర్‌శీన, విశ్వనాథ్‌, ఆంజనేయులు, చిత్తరంజన, నాగేశనాయుడు, పోతన్న, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, మారుతీప్రసాద్‌, బ్రహ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 12:01 AM