కార్యకర్తల కష్టంతోనే అధికారంలోకి వచ్చాం
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:40 PM
కార్యకర్తల కష్టంతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన(సర్)పై అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పరిటాల సునీత నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలో సోమవారం క్లస్టర్, యూనిట్, బూతలెవల్ ఏజెంట్లు, నాయకులతో సమావేశమై సర్‌పై అవగాహన కల్పించారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత
కనగానపల్లి, జూన 8(ఆంధ్రజ్యోతి): కార్యకర్తల కష్టంతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన(సర్)పై అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పరిటాల సునీత నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలో సోమవారం క్లస్టర్, యూనిట్, బూతలెవల్ ఏజెంట్లు, నాయకులతో సమావేశమై సర్‌పై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ 15వ తేదీ నుంచి జరిగే సర్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్ విచారణలో బూత లెవల్ అధికారులకు అందుబాటులో ఉండి అర్హులైన ఓటర్లను తొలగించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. డబుల్, డెత ఓట్లపై అప్రమత్తంగా ఉంటూ 18 ఏళ్లు నిండిన యువతీ, యువకుల ఓట్లను నమాదుచేయించాలన్నారు. కార్యకర్తల కష్టంతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. నియోజకవర్గ కో-ఆర్డీనేటర్, మార్కెట్‌యార్డ్ చైర్మన సుదాకర్‌చౌదరి, డీసీఎంఎస్ చైర్మన నెట్టెం వెంకటేష్, కన్వీనర్ యాతం పోతలయ్య, ప్రధాన కార్యదర్శి పతకమూరి అంజి, క్లస్టర్ ఇనచార్జ్‌లు బిల్లే దాము, పూజారి రాజాక్రిష్ణ పాల్గొన్నారు.