fire ఆకతాయిల నిప్పు
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:40 AM
ఆకతాయిలు కొండ ప్రాంతాల్లో ఎండుగడ్డికి నిప్పు పెట్టడంతో అటవీ సంపదతో పాటు సమీపంలోని పంటలు సైతం అగ్నికి ఆహుతవుతున్నాయి.
మడకశిర రూరల్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఆకతాయిలు కొండ ప్రాంతాల్లో ఎండుగడ్డికి నిప్పు పెట్టడంతో అటవీ సంపదతో పాటు సమీపంలోని పంటలు సైతం అగ్నికి ఆహుతవుతున్నాయి.
మండలం లోని బుళ్లసముద్రం గ్రామ సమీపంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎండుగడ్డికి నిప్పంటించారు. దీంతో సమీపంలోని నయాజ్ బాషా తోటకు మంటలు వ్యాపించాయి. దీంతో ఆ రైతు సాగు చేసిన మామిడి, నేరేడు, నిమ్మ, కొబ్బరి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. పూత దశలో ఉన్న 30 మామిడిచెట్లు, 20 కొబ్బరి చెట్లు, 12 నేరేడు చెట్లు, ఏడు నిమ్మచెట్లు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఆకతాయిలపై చర్యలు తీసుకుని, రైతులకు నష్టం కలగకుండా చూడాలని కోరాడు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..