Share News

The authorities are watching అధిష్టానం అన్నీ గమనిస్తోంది..

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:19 AM

అనంతపురం అర్బనలో జరుగుతున్న అన్ని పరిణామాలను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోందని, ఎవరికీ నష్టం జరగనివ్వదని జోన-5 ఇనచార్జి కోవెలమూడి నాని(రవీంద్ర) పేర్కొన్నారు. సోమవారం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ నియోజకవర్గ క్లస్టర్‌ ఇనచార్జులతో కలిసి విజయవాడలో నానితో భేటీ అయ్యారు.

The authorities are watching అధిష్టానం అన్నీ గమనిస్తోంది..

అనంతపురం క్రైం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): అనంతపురం అర్బనలో జరుగుతున్న అన్ని పరిణామాలను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోందని, ఎవరికీ నష్టం జరగనివ్వదని జోన-5 ఇనచార్జి కోవెలమూడి నాని(రవీంద్ర) పేర్కొన్నారు. సోమవారం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ నియోజకవర్గ క్లస్టర్‌ ఇనచార్జులతో కలిసి విజయవాడలో నానితో భేటీ అయ్యారు.


ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను, ఇబ్బందులను వారు నాని దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం నాని మాట్లాడుతూ...పార్టీ అన్ని అంశాలను పరిశీలిస్తోందన్నారు. పార్టీకి, కార్యకర్తలకు ఎలాంటి నష్టం రానివ్వదని హామీ ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ నానితో ప్రత్యేకంగా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌ యాదవ్‌, ఫిరోజ్‌ అహ్మద్‌, పొట్లూరి హరికృష్ణ, రాజారావు, సాకే లక్ష్మినరసింహ, కాయగూరలశ్రీధర్‌, వన్నూరప్ప, గోపాల్‌గౌడ్‌, దళవాయి వెంకటనారాయణ,చేపల హరి, కృష్ణం రఘు, పొట్లూరి కేశవనాయుడు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Feb 03 , 2026 | 01:19 AM