ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
ABN , Publish Date - Mar 24 , 2026 | 08:42 PM
అనంతపురం జిల్లాలో సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన ఆర్డీటీ సంస్థకు ఎదురైన ఎఫ్‌సీఆర్‌ఏ సమస్యలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించామని ఆయన తెలిపారు.
ఢిల్లీ: అనంతపురం జిల్లాలో పేద ప్రజలకు విద్య, వైద్యం వంటి సేవలు అందిస్తూ విశేష గుర్తింపు పొందిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) సంస్థకు ఎదురైన ఇబ్బందులపై టీడీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందించారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) అనుమతుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన తెలిపారు. అయితే, ఆర్డీటీ వంటి సేవా సంస్థ ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరినట్లు ఆయన వెల్లడించారు. సీఎం ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఆర్డీటీ సంస్థ చేస్తున్న సేవలను వివరించినట్లు చెప్పారు.
టీడీపీ ఎంపీలు కూడా గత ఏడాది నుంచి కలిసి కేంద్ర హోంశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి, ఆర్డీటీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కారం కావాలని కోరినట్లు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఈ కృషి ఫలితంగా ఇప్పుడు ఆర్డీటీకి అవసరమైన ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు లభించినట్లు తెలిపారు. ఇదే సమయంలో, ఈ అంశంపై వైసీపీ నేతలు పార్లమెంట్‌లో ఎప్పుడూ ప్రస్తావించలేదని ఆయన విమర్శించారు. సమస్యను ఎవరి దృష్టికి తీసుకెళ్లలేదని, ఇప్పుడు క్రెడిట్ కోసం మాట్లాడటం సరికాదని అన్నారు. ఆర్డీటీ సమస్య పరిష్కారంలో ఎవరు కృషి చేశారో ఆ సంస్థకు బాగా తెలుసని లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ సమస్యలపై వినతులు
అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ కట్టడాలు: మంత్రి నారాయణ
నా కుమారుడు మహేశ్ యాదవ్‌కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్
Read Latest AP News