Share News

Take action నిప్పు పెట్టేవారిపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:46 AM

ఉమ్మడి జిల్లాల్లో జనవరి నుంచి మార్చి వరకు కొండగుట్టలకు నిప్పు పెట్టేవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సాహితీగగన్మహల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు ప్రతా్‌పరెడ్డి కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ను కోరారు. జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎ్‌సలో ఈమేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Take action  నిప్పు పెట్టేవారిపై చర్యలు తీసుకోండి
కలెక్టర్‌కు వినతిని అందిస్తున్న ట్రస్ట్‌ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి

పెనుకొండ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాల్లో జనవరి నుంచి మార్చి వరకు కొండగుట్టలకు నిప్పు పెట్టేవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సాహితీగగన్మహల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు ప్రతా్‌పరెడ్డి కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ను కోరారు. జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎ్‌సలో ఈమేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.


జిల్లాల్లోని కొండగుట్టలకు జనవరి నెల నుంచి మార్చి నెలవరకు ఆకతాయిలు ఎండిన గడ్డికి నిప్పు పెడతారన్నారు. దీనివల్ల లక్షలాది చెట్లతోపాటు పందులు, చిరుతలు, జింకలు, ఎలుగుబంట్లతో పాటు అనేక రకాల జంతువులు, పక్షులు చనిపోతున్నాయన్నారు. ప్రస్తుతం అడవులు వృద్ధి చెందుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కొండ గుట్టలకు నిప్పు పెడితే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. వీటిని అరికట్టాలని కలెక్టర్‌ను కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Feb 17 , 2026 | 12:46 AM