నేరేడు పండ్ల కోసం వెళ్లి.. ముగ్గురు చిన్నారుల మృతి
ABN , Publish Date - May 27 , 2026 | 07:44 PM
శ్రీసత్యసాయి జిల్లాలోని రొద్దం మండలం నారనాగేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నేరేడు పండ్ల కోసం వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఈ ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా: రొద్దం మండలం నారనాగేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నేరేడు పండ్ల కోసం వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. నారనాగేపల్లికి చెందిన అజయ్ రెడ్డి, కల్పన దంపతుల కుమారులు విష్ణు (13), దరహాస్ రెడ్డి (12) ప్రాణాలు కోల్పోయారు. అలాగే హర్షిత్ అనే 10 ఏళ్ల బాలుడు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు.
చిన్నారుల మృతి పట్ల మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారుల దుర్మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందడం మరింత కలచివేసే విషయమని మంత్రి అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
సెలవుల సమయంలో పిల్లల కదలికలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి.. చెరువులు, వాగులు, నీటి కుంటల వద్ద పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నష్టం జరిగిన తర్వాత ఆ బాధను పూడ్చుకోవడం సాధ్యం కాదని మంత్రి సవిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో భారీగా ఎమ్మార్వోలు బదిలీ
నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్
For More AP News