Share News

government schools ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం స్పెషల్‌ డ్రైవ్‌

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:24 AM

మండలంలోని పాలసముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల కోసం స్పెషల్‌ డ్రైవ్‌ పేరిట బడిలో చేరుదాం- బాగుపడదాం అనే కార్యక్రమాన్ని ఎంఈవో గోపాల్‌ గురువారం ప్రారంభించారు. హెచఎం రామాంజులుయాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాకమిటీ సభ్యులు, పూర్వవిద్యార్థులు హాజరయ్యారు.

government schools  ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం స్పెషల్‌ డ్రైవ్‌

గోరంట్ల, ఏప్రిల్‌16(ఆంధ్రజ్యోతి): మండలంలోని పాలసముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల కోసం స్పెషల్‌ డ్రైవ్‌ పేరిట బడిలో చేరుదాం- బాగుపడదాం అనే కార్యక్రమాన్ని ఎంఈవో గోపాల్‌ గురువారం ప్రారంభించారు. హెచఎం రామాంజులుయాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాకమిటీ సభ్యులు, పూర్వవిద్యార్థులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా వారు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ, ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతలను , వసతులను వివరించారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రాథమిక పాఠశాలలో 5వతరగతి చదువుతున్న 21మంది విద్యార్థులను చైతన్య పరచి, ఉన్నతపాఠశాలలో చేరేలా వారితో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ప్రతిభ ప్రైవేటు పాఠశాలలోని 7వతరగతి చదువుతున్న 17మందిని ఉన్నతపాఠశాలలో చేరాలని కోరారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీ వరకు చేపట్టనున్నట్లు ఎంఈవో తెలిపారు. పూర్వ విద్యార్థులు సోమలింగారెడ్డి, రామచంద్రారెడ్డి, బాలరాజు, ఉపాధ్యాయులు సుధాకర్‌రెడ్డి, గంగరాజు, ప్రమథ, రాధారమణ, ఇందిరారమణి, వేణుగోపాల్‌, సునీత, విజయలక్ష్మి, జరీనా, కాంతామణి, మంజుల, కవిత, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 17 , 2026 | 12:24 AM