Share News

మామపై అల్లుడి దాడి

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:05 AM

మండలకేంద్రంలోని బీసీ కాలనీలో నివాసముంటున్న బుచ్చప్ప గారి వెంకటక్రిష్ణపై అల్లుడు చిరంజీవి దాడి చేశాడు. కొద్దిరోజులక్రితం చిరంజీవి భార్యతో గొడపడడంతో ఆమె పుట్టింటికి వచ్చింది.

మామపై అల్లుడి దాడి

రొద్దం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని బీసీ కాలనీలో నివాసముంటున్న బుచ్చప్ప గారి వెంకటక్రిష్ణపై అల్లుడు చిరంజీవి దాడి చేశాడు. కొద్దిరోజులక్రితం చిరంజీవి భార్యతో గొడపడడంతో ఆమె పుట్టింటికి వచ్చింది.


దీంతో ఆమెను తనతో పాటు తీసుకెళ్లేందుకు అతను అత్తగారి ఇంటికి శనివారం రాత్రి 7గంటలకు వచ్చాడు. అయితే మామ బుచ్చప్పగారి వెంకటక్రిష్ణ కుమార్తెను పంపనని చెప్పడంతో కోపోధ్రిక్తుడైన చిరంజీవి దాడికి పాల్పడ్డాడు. వెంకటకృష్ణకు రక్తగాయాలవడంతో స్థానికులు వెంటనే 100కు కాల్‌ చేశారు. ఎస్‌ఐ వీరాంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితున్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదివరకే గొడవలు జరగడంతో చిరంజీవిని తహసీల్దార్‌ వద్ద బైండోవర్‌ చేశారు. ఈ మేరకు విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం

Updated Date - Mar 17 , 2026 | 01:05 AM