ప్రజాదర్బార్‌లోనే సమస్యల పరిష్కారం
ABN , Publish Date - May 29 , 2026 | 11:29 PM
ప్రజాదర్బార్‌లోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. శుక్రవారం అనంతపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
శింగనమల, మే 29(ఆంధ్రజ్యోతి): ప్రజాదర్బార్‌లోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. శుక్రవారం అనంతపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతులు ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన సమస్యలను వెంటనే పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాన్నారు.
ఏపీ నిర్మాణంలో ఏకైక రాజధాని అమరావతి: సనరైజ్ ఆంధ్రప్రదేశ నిర్మాణంలో ఏకైక రాజధాని అమరావతి అని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. శుక్రవారం బాయ్ ఏరియా కాలిఫోర్నియా ఎన్నారై వింగ్ ప్రత్యేక మహానాడులో వీడియో కాన్ఫరెన్స కార్యాక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మె ల్యే హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత, మహిళల ఆ ర్థిక పరోగతి యవతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్రపై వివరించారు. విదేశాలల్లో నివసిస్తున్నా రాష్ట్రాభివృద్ధిపై మక్కువతో గత ఎన్నికల సమయంలో ఎన్నారైలు స్వదేశానికి వచ్చి ఓటు హాక్కు వినియోగించుకోవడం అభినందనీయం అన్నారు.