విద్యుత సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:19 AM
రాప్తాడు, ధర్మవరం నియోజకవవర్గాల్లో విద్యుత సమస్యలు పరిష్కరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమ పేరుతో తిరుపతి దామినేడులో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ, విద్యుత శాఖ మంత్రి గొట్టిపాటితో పాటు పలువురు మంత్రులతో ఆమె భేటీ ఆయ్యారు.
అనంతపురంరూరల్,జూన12(ఆంధ్రజ్యోతి): రాప్తాడు, ధర్మవరం నియోజకవవర్గాల్లో విద్యుత సమస్యలు పరిష్కరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమ పేరుతో తిరుపతి దామినేడులో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ, విద్యుత శాఖ మంత్రి గొట్టిపాటితో పాటు పలువురు మంత్రులతో ఆమె భేటీ ఆయ్యారు. రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న విద్యుత సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా కొత్త సబ్‌స్టేషన్లు మంజూరు, పెండింగ్‌లో ఉన్న 485 విద్యుత ట్రాన్సఫార్మర్లు మంజూరు చేయడంతోపాటు 1520 కొత్త వ్యవసాయ విద్యుత కనెక్షన్లకు అనుమతులు ఇవ్వాలని కోరారు. 366కిలోమీటర్లు మేర ఎల్‌టీ కేబుల్, 161 కి.మీ కండక్టర్, 4,800 కరెంట్ పోల్స్ మంజూరు చేయాలని కోరారు. ఆరు మండలాలలో విద్యుత ఏఈ ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలన్నారు. ఆరు సెక్షన్లలో మెరుగైన విద్యుత సౌకర్యాన్ని కల్పించడానికి ఒక్కో సెక్షనలో ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్స్ నియామకం కూడా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కారుణ్య నియామకాల గురుంచి ప్రస్తావించారు. ధర్మవరం నియోజకవర్గంలోని సమస్యలను కూడా పరిటాల శ్రీరామ్ తరుఫున మంత్రికి వినతి పత్రం అందజేశారు. వీటిపై మంత్రి గొట్టిపాటి సానుకూలంగా స్పందించారు. వెంటనే వీటన్నింటినీఈ పరిశీలించాలని సీఎండీని ఆదేశించారు. సీఎండికి కూడా రెండు నియోజకవర్గాల తరుఫున వినతి పత్రాలు అందజేశారు. మరో వైపు రెండేళ్ల నమ్మకం బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం వైసీపీ నేతల కళ్లకు కనిపించడం లేదని విమర్శించారు. పెట్టుబడులు కూడా రాష్ట్రానికి పెద్దఎత్తున వస్తున్నాయని వీటిని జీర్ణించుకోలేకనే వైసీపీ నిరసన కార్యక్రమాలు చేస్తోందన్నారు.