Observation రీసర్వే పనుల పరిశీలన
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:20 AM
మండలంలోని చిగతుర్పి గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే పనులను ఆర్డీవో ఆనంద్‌కుమార్ గురువారం పరిశీలించారు.
గుడిబండ, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిగతుర్పి గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే పనులను ఆర్డీవో ఆనంద్‌కుమార్ గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రీసర్వే వల్ల భూముల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి భూ రీసర్వేను రైతులందరూ వినియోగించుకోవాలని సూచించారు. రీసర్వే అయిన వెంటే పట్టాదారు పాసుపుస్తకాలను అందచేస్తామన్నారు. డిప్యూటీ తహసీల్దార్ రామ్‌కుమార్‌రెడ్డి, ఆర్‌ఐ నెలకోటప్ప, వీఆర్‌వోలు త్యాగరాజు, రాధామణి, ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..