మల్బరీ షెడ్డు దగ్ధం
ABN , Publish Date - Mar 17 , 2026 | 01:00 AM
మండలంలోని గుండుమల గ్రామంలో దాసప్పకు చెందిన మల్బరీ షెడ్డుకు మంటలు వ్యాపించి దగ్ధమైంది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
మడకశిర రూరల్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుండుమల గ్రామంలో దాసప్పకు చెందిన మల్బరీ షెడ్డుకు మంటలు వ్యాపించి దగ్ధమైంది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
గత ఆదివారం రాత్రి మల్బరీ షెడ్డు సమీపంలోని కంప చెట్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని, ఆ చెట్లు కాలుకుంటూ మంటలు మల్బరీ షెడ్డుకు వ్యాపించాయని చెప్పారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు అదుపు చేసినట్లు తెలిపారు. అప్పటికే షెడ్డు లోని సూట్‌తో పాటు పట్టు పురుగులు కొంత భాగం కాలిపోయినట్లు వాపోయారు. షెడ్‌లో వివిధ సామగ్రి కూడా కాలిపోయి అపార నష్టం వాటిలినట్లు ఆవేదన చెందారు. విషయం తెలుసుకున్న సిరికల్చర్ ఏడీ హనుమంతనాయక్ సోమవారం ఆ గ్రామానికి వెళ్లి కాలిపోయిన షెడ్డును పరిశీలించారు. అనంతరం నష్టంపై అంచనా వేసి ఉన్నతాధికాలకు నివేదిక పంపనున్నట్లు ఏడీ తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం