sports రాష్ట్రస్థాయి పోటీలకు ఎంజేపీ విద్యార్థినులు
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:15 AM
మండలకేంద్రంలోని మహత్మాజ్యోతిరావుఫూలే గురుకుల జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదివిన విద్యార్థినులు సువర్ణ, శ్వేత, బిందు, ధరణీ, స్వాతి, పరిమళా, నక్షత్ర, నిహారిక, నందిని హిందూపురంలో ఆంధ్రప్రదేశ హ్యాండ్‌బాల్ అసోషియేషన ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు.
గుడిబండ, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని మహత్మాజ్యోతిరావుఫూలే గురుకుల జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదివిన విద్యార్థినులు సువర్ణ, శ్వేత, బిందు, ధరణీ, స్వాతి, పరిమళా, నక్షత్ర, నిహారిక, నందిని హిందూపురంలో ఆంధ్రప్రదేశ హ్యాండ్‌బాల్ అసోషియేషన ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు.
వారు ఈనెల 18, 19 తేదీల్లో నెల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్, పీడీ గురువారం తెలిపారు. అనంతరం ఆ విద్యార్థినులను అభినందించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..