మహానాడును విజయవంతం చేయండి: టీడీపీ
ABN , Publish Date - May 26 , 2026 | 01:15 AM
టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఈనెల 27, 28 తేదీల్లో వర్చువల్‌గా నిర్వహించనుందని, మండలంలో నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పార్టీ మండల కన్వీనర్ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు.
అమరాపురం, మే 25(ఆంధ్రజ్యోతి): టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఈనెల 27, 28 తేదీల్లో వర్చువల్‌గా నిర్వహించనుందని, మండలంలో నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పార్టీ మండల కన్వీనర్ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జరిగే కార్యక్రమాన్ని స్ర్కీన్ల ద్వారా వీక్షించాలని తెలిపారు. ఆ గ్రామ పంచాయతీల క్లస్టర్ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షుడు గణేష్, మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, మాజీ కన్వీనర్ శివరుద్రప్ప, నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షుడు మారుతీప్రసాద్, నియోజకవర్గ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు జయకుమార్, క్లస్టర్ కన్వీనర్లు నవీన, కృష్ణమూర్తి, కో కన్వీనర్‌లు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తలు