కొబ్బరి చెట్టుపై పిడుగు
ABN , Publish Date - May 26 , 2026 | 01:10 AM
మండలంలోని చినన్నపల్లిలో సోమవారం ఉద యం కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టు మంటల్లో చిక్కుకుంది. ఉదయం ఓ మోస్తారు వర్షం కురిసింది.
చిలమత్తూరు, మే 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చినన్నపల్లిలో సోమవారం ఉద యం కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టు మంటల్లో చిక్కుకుంది. ఉదయం ఓ మోస్తారు వర్షం కురిసింది.
ఉరుములు, మె రుపులు గాలితో కూడిన వర్షం కురిసింది. ఈ క్ర మంలో గ్రామంలోని ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. పెద్ద శబ్దం రావడంతో బయట చూడ గా కొబ్బరి చెట్టుపై మంటలు వ్యాపించాయని గ్రామస్థులు తెలిపారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని అనంతపురం వార్తలు