Share News

Justice for employees కూటమి పాలనలో ఉద్యోగులకు న్యాయం

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:22 AM

కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతోందని వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు హార్షాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌, మంత్రులు లోకేష్‌, సత్యకుమార్‌ యాదవ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

Justice for employees కూటమి పాలనలో ఉద్యోగులకు న్యాయం

అనంతపురం వైద్యం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతోందని వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు హార్షాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌, మంత్రులు లోకేష్‌, సత్యకుమార్‌ యాదవ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.


ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు మాధవ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ మేల్‌(ఎంపీహెచఏ) 730 ఉద్యోగులను గత ప్రభుత్వం తొలగించిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం చొరవతీసుకుని తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీదేవి చేతులమీదుగా 37మంది ఉద్యోగులు నియామక పత్రాలందుకున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీధర్‌బాబు, లక్ష్మినారాయణ, నాయకులు ప్రవీణ్‌కుమార్‌, అక్కులప్ప, తిరుపలయ్య, నర్సారెడ్డి, శ్యాముల్‌, శేషగిరి పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Feb 03 , 2026 | 01:23 AM