కూటమికి మరో 15ఏళ్లు అధికారం ఇవ్వండి
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:42 PM
రాష్ట్రం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ఎదగాలం టే కూటమి ప్రభుత్వానికి మరో 15 ఏళ్లు ప్రజలు అధికా రం ఇవ్వాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బం డారు శ్రావణిశ్రీ అ న్నారు.
బుక్కరాయసముద్రం: రాష్ట్రం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ఎదగాలం టే కూటమి ప్రభుత్వానికి మరో 15 ఏళ్లు ప్రజలు అధికా రం ఇవ్వాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బం డారు శ్రావణిశ్రీ అ న్నారు. సోమవారం కొట్టాపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. పసుపుల శ్రీరామిరెడ్డి, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, మార్కెట్‌యార్డు వైస్ చైర్‌పర్సన శైలజ, సహకార సొసైటీ చైర్మన కేశన్న, ఎంపీపీ సునీత, ఓబులపతి, కేశవరెడ్డి, పెద్దప్ప, జొన్నారామయ్య పాల్గొన్నారు.