‘స్థానిక ఎన్నికలకు సమాయత్తం కండి’
ABN , Publish Date - May 22 , 2026 | 12:13 AM
త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ సురేంద్ర సూచించారు.
లేపాక్షి, మే 21(ఆంధ్రజ్యోతి): త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ సురేంద్ర సూచించారు.
మండలంలోని నాయనపల్లి, కొండూరు పంచాయతీల్లో గురువారం వారు నాయకులు, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. త్వరలో వచ్చే ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభవృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని తెలిపారు. మండల కన్వీనర్ అభిలాష్, టూరిజం డైరెక్టర్‌జయప్ప, మాజీ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచ సిద్దు, నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..