Share News

యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలి

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:41 PM

యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం అనంతపురం రూరల్‌ తహసీల్దార్‌ ఉదయభాస్కర్‌కు వినతి పత్రం ఇచ్చారు.

యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలి
Leaders of the farmers' association submitting a petition to the tahsildar

అనంతపురంరూరల్‌, జూన 22(ఆంధ్రజ్యోతి): యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం అనంతపురం రూరల్‌ తహసీల్దార్‌ ఉదయభాస్కర్‌కు వినతి పత్రం ఇచ్చారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బీహెచ రాయుడు, చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఖరీ్‌ఫలో వర్షాలురావడంతో రైతులు పంటలు సాగు చేసేందుకు సిద్ధమయ్యే సమయంలో అవసరమైన ఎరువులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎరువుల వాడకంలో కూడా చాలా తేడా ఉంటుందన్నారు. దానికి భిన్నంగా ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన నుంచి ప్రభుత్వం రెండు ఎకరాలకు నాగులు యురియా, నాలుగు డీఏపీ బస్తాలు మాత్రమే ఇస్తామంటున్నారన్నారు. రైతులకు అవసరాన్ని బట్టి ఎరువులు ఇవ్వాలన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివారెడ్డి, సంజీవరెడ్డి, వెంకట్రామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, నారాయణ పాల్గొన్నారు.

రాప్తాడు: యాప్‌ ద్వారా కాకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా యూరి యా, ఎరువులు పంపిణీ చేయాలని రైతు సంఘం మండల అధ్యక్షుడు పోతులయ్య కోరారు. సోమవారం తహసీల్దార్‌ చెన్నకేశవులుకు నాయకులు వినతిపత్రం అందచేశారు. ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన మేరకు యూరియా, ఎరువులు అందించాలన్నారు. యూరియా అక్రమంగా నిల్వ ఉంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 11:41 PM