Father Vincent Ferrer's ఘనంగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:26 AM
ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 106వ జయంతి వేడుకలను పట్టణంలోని నాలుగోవార్డులో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం యూటీఎఫ్ నాయకులు ఘనంగా నిర్వహించారు.
మడకశిర టౌన, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 106వ జయంతి వేడుకలను పట్టణంలోని నాలుగోవార్డులో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం యూటీఎఫ్ నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫెర్రర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. కరవుతో వెనకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. పేదలకు అనేక రకాల సేవలందించి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ప్రతిఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు భూతన్న, కార్యదర్శి డి.నరసింహప్ప, నాయకులు రవీంద్ర, నంజప్ప, రామాంజప్ప, డి.అశోక్, నవీన తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..