రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధంకండి
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:37 PM
జిల్లాలో ముందస్తు వర్షాలు కురుస్తున్నాయని, రైతులు ఖరీ్‌ఫకు సిద్ధంకావాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. త్వరలోనే ప్రభుత్వం విత్తన కాయలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మండలంలోని సనప గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు.
ఆత్మకూరు, జూన 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ముందస్తు వర్షాలు కురుస్తున్నాయని, రైతులు ఖరీ్‌ఫకు సిద్ధంకావాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. త్వరలోనే ప్రభుత్వం విత్తన కాయలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మండలంలోని సనప గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. రూ.80 లక్షలతో నిర్మించనున్న 12 సీసీ రోడ్లకు శిలాఫలకాలను ఆమె ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులు, వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరగాలంటే సీఎం చంద్రబాబు ఉండాలన్నారు. 23నెలల్లో చేసిన అభివృద్ధిని ప్రతిఒక్కరూ గుర్తించాలన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నియోజకవర్గంలో వేశామన్నారు.
గోదాములు ఉపయోగకరం
రైతులు పండించిన నిల్వ ఉంచేందుకు గోదాములు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అన్నారు. వీటితో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. మండలలోఓ 3 గోదాములు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన గోదాములు పూర్తిచేసి రైతులుకు అందుబాటులోకి తెచ్చామన్నారు. సనపలో రూ.82 లక్షలతో పెద్ద గోదామును రైతులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. పి.యాలేరు సొసైటీ నుంచి మంచి సేవలు అందిస్తున్నారని సిబ్బందిని అభినందించారు. టీడీపీ ఇనచార్జి బాలాజీ, ఏడీసీసీ చైర్మన నెట్టం వెంకటేసులు, సొసైటీ చైర్మన క్రిష్ణమోహన చౌదరి, మండల కన్వీనర్ శ్రీనివాసులు, నరసింహ చౌదరి, శశాంక చౌదరి, రఘునాథరెడ్డి, బొమ్మయ్య, వెంకటనారాయణ, ఎంపీడీవో లక్ష్మీనరసింహ, డీఈ నారాయణస్వామి, సీఈవో హనుమంత రెడ్డి, మండల నాయకులు పోతులయ్య, వేణుగోపాల్, వెంకట్రామిరెడ్డి, కాంత, రవీంద్రారెడ్డి, నాగరాజు, బాలు, అక్కులప్ప పాల్గొన్నారు.