Eagle Team దుకాణాల్లో ఈగల్ టీమ్ సోదాలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:17 AM
పట్టణంలోని విద్యాసంస్థలు, పరిసర ప్రాంతాల్లో గురువారం ఈగల్ ప్రత్యేక టీ మ్ సభ్యులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బోయపేట, చిన్నమార్కెట్ ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థల ఏరియాల్లో చిల్లరకొట్లు, షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
హిందూపురం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని విద్యాసంస్థలు, పరిసర ప్రాంతాల్లో గురువారం ఈగల్ ప్రత్యేక టీ మ్ సభ్యులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బోయపేట, చిన్నమార్కెట్ ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థల ఏరియాల్లో చిల్లరకొట్లు, షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
టీ స్టాల్, పానసెంటర్లలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా తనిఖీల్లో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఇతర హానికర ఉత్పత్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులపై చట్టపరమైన చర్యలకు నివేధించి జరిమానా విధించామన్నారు. అదేవిధంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశమై యువత పొగాకు ఉత్పత్తులు వాడితే కలిగే అనర్థాల గురించి వివరించారు. వీటిపై నిరంతర నిఘా ఉంటుందని, ప్రత్యేక డ్రైవ్ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ లింగన్న, జిల్లా ఈగల్ టీమ్ ఆర్‌ఎ్‌సఐ శ్రీహరి, మిజ్బా, జిల్లా టొబోకో నిషేదిత అధికారి రాధమ్మ, సైకాలజిస్ట్ జీవన, సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..