Share News

‘ఉపాధి పనులకు రండి’

ABN , Publish Date - May 22 , 2026 | 12:16 AM

గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో రావాలని ఎంపీడీవో గంగాధర్‌ తెలిపారు. మండలంలోని జంగమరనహళ్లి, ముక్కడంపల్లి, పూలపల్లి, దాసేగౌడనహళ్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను గురువారం ఆయన పరిశీలించారు.

‘ఉపాధి పనులకు రండి’

అగళి, మే 21(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో రావాలని ఎంపీడీవో గంగాధర్‌ తెలిపారు. మండలంలోని జంగమరనహళ్లి, ముక్కడంపల్లి, పూలపల్లి, దాసేగౌడనహళ్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను గురువారం ఆయన పరిశీలించారు.


ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ.. ప్రతి గ్రామం నుంచి కూలీలు అధిక సంఖ్యలో ఉపాధి పనులలో పాల్గొనాలన్నారు. సకాలంలో బిల్లులు వస్తాయన్నారు. ఉదయం 6కు వచ్చి 10 గంటలలోపు పనులు ముగించుకుని ఇంటికి వెళ్లాలన్నారు. తర్వాత ఆర్‌జీపల్లి పంచాయతీలో పారిశుధ్య పనులను పరిశీలించారు. టెక్నికల్‌ ఇంజనీర్‌ ఈరన్న తదితరులు ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - May 22 , 2026 | 12:16 AM