Share News

క్రీడలతో జీవితంలో మార్పు

ABN , Publish Date - May 24 , 2026 | 11:54 PM

క్రీడలు మానసికోల్లాసం ఇవ్వడంతోపాటు జీవితాన్ని మారుస్తాయని ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత జన్మదినాన్ని పురస్కరించుకుని పాపంపేటకు చెందిన టీడీపీ యువ నాయకుడు హరీ్‌షరెడ్డి ఆధ్వర్యంలో రాప్తాడు ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు నిర్వహించారు.

క్రీడలతో జీవితంలో మార్పు
MLA, Dharmavaram in-charge Paritala Sriram presenting the trophy to the winning team

ఎమ్మెల్యే పరిటాల సునీత

అనంతపురంరూరల్‌, మే 24(ఆంధ్రజ్యోతి): క్రీడలు మానసికోల్లాసం ఇవ్వడంతోపాటు జీవితాన్ని మారుస్తాయని ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత జన్మదినాన్ని పురస్కరించుకుని పాపంపేటకు చెందిన టీడీపీ యువ నాయకుడు హరీ్‌షరెడ్డి ఆధ్వర్యంలో రాప్తాడు ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఫైనల్‌ మ్యాచ ఇటుకలపల్లి, గంగులకుంట జట్ల మధ్య జరిగాయి. ఇటుకలపల్లి జట్టు విజేతగా నిలిచింది. పరిటాల మెమోరియల్‌ ట్రస్ట్‌ తరఫున కప్‌తోపాటు రూ.50వేల నగదు బహుమతిని, రన్నర్‌ జట్టుకు రూ.25వేలు అందజేశారు. పోటీలను ఎమ్మెల్యే సునీత, పరిటాల శ్రీరామ్‌ ఆసక్తిగా తిలకించారు. వారు మాట్లాడుతూ వారం రోజులపాటు ఇంత పెద్ద ఎత్తున టోర్నమెంట్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ర్యాంకుల పేరుతో తీవ్ర ఒత్తిడి తెస్తున్నారన్నారు. ర్యాంకులు రాకపోతే జీవితమే లేదన్నట్లు చేస్తున్నారన్నారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమన్నారు. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయిష్టాలను తెలుసుకుని వారిని ప్రోత్సహించాలన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడా కోటాలో రెండు శాతం ఉన్న రిజర్వేషనను మూడు శాతానికి పెంచినట్లు తెలిపారు. దీంతో ఎంతో మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చదువుల్లో కూడా రిజర్వేషన్లు ఉంటాయన్నారు. క్రీడలకు ఈ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో క్రీడా కోటాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఫిజికల్‌ డైరెక్టర్లుగా ఉద్యోగాలు సాధించిన జగదీష్‌, పృథ్వీరాజ్‌, శివకుమార్‌లను సత్కరించారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను నాయకులు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేయించారు.

Updated Date - May 24 , 2026 | 11:54 PM