పేదల పెద్దకొడుకు చంద్రబాబు
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:39 PM
పేదల ఇంటి పెద్ద కొడుకు సీఎం చంద్రబాబు అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు అన్నారు.
గార్లదిన్నె, జూన 1 (ఆంధ్రజ్యోతి): పేదల ఇంటి పెద్ద కొడుకు సీఎం చంద్రబాబు అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా సోమవారం గార్లదిన్నెలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, ఏడీసీసీబీ చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి, అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మనలతో గౌస్‌మోద్దీనలతో కలిసి ఆయన వృద్ధులు, దివ్యాంగులకు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఇందిరమ్మ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. చంద్రశేఖర్ నాయుడు, గేటుక్రిష్ణారెడ్డి, ఆదినారాయణ, పాండు, రామకృష్ణ, గుర్రం శీనా, గుత్తా హరి, డాబా వెంకటేష్, నల్లప్ప, రామకృష్ణ, గుత్తా లక్ష్మీనారాయణ, ఆవుల శీనా, కొర్రపాటి శీనా, రామాంజి, పక్కీరప్ప కదిరప్ప పాల్గొన్నారు.