Share News

GOD: ఘనంగా లంకా దహనం

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:29 PM

డి.హీరేహాళ్‌ మండలం లోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వా మి ఉత్సవాల సందర్భం గా ఆదివారం రాత్రి లం కా దహనం కార్య్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

GOD: ఘనంగా లంకా దహనం

డి. హీరేహాళ్‌ (బొమ్మనహాళ్‌), మార్చి, 22(ఆంధ్రజ్యోతి): డి.హీరేహాళ్‌ మండలం లోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వా మి ఉత్సవాల సందర్భం గా ఆదివారం రాత్రి లం కా దహనం కార్య్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం గండా దీపాలు మోసి, సాయంత్రం వసం తోత్సవం, రాత్రి 7:30 గంటలకు లంకా దహనా న్ని ఘనంగా నిర్వహించా రు. రాత్రి 9 గంటలకు మహామంగళహారతి ఇ చ్చారు. గ్రామంలో శ్రీరామ చెక్క భజన నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

27న సీతారామాంజనేయస్వామి తిరుణాల

పుట్లూరు: మండలంలోని రంగమనా యునిపల్లి శివారులో వెలసిన సీతారామాంజనేయస్వామి ఆలయం వద్ద ఈ నెల 27న తిరుణాల జరగనున్నట్లు ఆదివారం గ్రామపెద్దలు తెలి పారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణోత్సం, రాతిదూలం లాగు డు పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీల్లో గెలుపొందిన వృషభాలకు నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. వాటితోపాటు ఆల యం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 22 , 2026 | 11:29 PM