Share News

ప్రతినె లా 5న బిల్లులు చెల్లించాలి

ABN , Publish Date - May 22 , 2026 | 12:11 AM

తమకు ప్రభుత్వం ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని, ప్రతినెలా 5వ తేదీ కల్లా తప్పనిసరిగా చెల్లించాలని సివిల్‌ సప్లయ్‌ గోడౌనలో పనిచేసే హమాలీలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పెనుకొండ పట్టణంలోని సివిల్‌ సప్లయ్‌ గోడౌన వద్ద గురువారం వారు హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి నాగరాజుతో కలిసి ఆందోళన చేపట్టారు.

ప్రతినె లా 5న బిల్లులు చెల్లించాలి

పెనుకొండ/గోరంట్ల, మే 21(ఆంధ్రజ్యోతి): తమకు ప్రభుత్వం ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని, ప్రతినెలా 5వ తేదీ కల్లా తప్పనిసరిగా చెల్లించాలని సివిల్‌ సప్లయ్‌ గోడౌనలో పనిచేసే హమాలీలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పెనుకొండ పట్టణంలోని సివిల్‌ సప్లయ్‌ గోడౌన వద్ద గురువారం వారు హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి నాగరాజుతో కలిసి ఆందోళన చేపట్టారు.


ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. హమాలీలకు ప్రభుత్వం ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఒప్పందం గడువు ముగిసినా కూలిరేట్లు పెంచలేదన్నారు. ప్రతినెలా 5వ తేదీ కల్లా బిల్లులు సక్రమంగా చెల్లించాలన్నారు. కొత్తవారికి పీఎఫ్‌ నంబర్లు ఇవ్వాలన్నారు. పని మానేసిన హమాలీలకు పెన్షన సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు హరి, సీఐటీయూ మండల కన్వీనర్‌ బాబావలి, హమాలీ యూనియన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే గోరంట్ల మండలకేంద్రంలోని సివిల్‌సప్లయ్‌ గోడౌన వద్ద హమాలీలు సీఐటీయూ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్నరీతిలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెడబల్లి బాబా, మండల కన్వీనర్‌ కమాల్‌బాషా, నాయకులు రమేష్‌, హమాలీలు గంగాధర్‌, బాబావలి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - May 22 , 2026 | 12:11 AM