GOD: భద్రావతి భావనారుషి కల్యాణోత్సవం
ABN , Publish Date - May 09 , 2026 | 11:08 PM
పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయంలో శనివారం భద్రావతి భావనా రుషీశ్వరుల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపం డితులు జానకిరామశర్మ భద్రావతి భావనా రుషీశ్వరుల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవ విగ్ర హాలను అలంకరించి పద్మ శాలి సంఘం ఆధ్వర్యంలో కల్యాణాన్ని ని ర్వహించారు. భక్తులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తాడిపత్రి, మే 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయంలో శనివారం భద్రావతి భావనా రుషీశ్వరుల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపం డితులు జానకిరామశర్మ భద్రావతి భావనా రుషీశ్వరుల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవ విగ్ర హాలను అలంకరించి పద్మ శాలి సంఘం ఆధ్వర్యంలో కల్యాణాన్ని ని ర్వహించారు. భక్తులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... తాడిపత్రిలో బుగ్గరామలింగేశ్వరస్వామి, చింతల వెంకట రమణస్వామి అశ్వత్థ నారాయణస్వామి, ఆలూరుకోన రంగనాథస్వామి వంటి ఎన్నో పవిత్రమైన దేవాలయాలను రాజులకాలంలోనే స్థాపించా రన్నారు. వాటితో పాటు తాడిపత్రి ప్రాంతాన్ని అందరం కలిసి మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. తాడిపత్రి ప్రజలు తనకు దేవుళ్లతో సమానమని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునే బాధ్యత తనదన్నారు. తాడిపత్రి పట్టణాన్ని మరింత అభివృద్ధిచేసి ఆదర్శంగా నిలుద్దామని ఆయన పిలుపునిచ్చారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....