Share News

fire అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:21 AM

జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక అధికారులు అగ్నిప్రమాదాల నివారణపై గురువారం పట్టణంలోని శ్రీకంఠపురంలో ప్రజలకు అవగాహన కల్పించారు.

 fire అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన

హిందూపురం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక అధికారులు అగ్నిప్రమాదాల నివారణపై గురువారం పట్టణంలోని శ్రీకంఠపురంలో ప్రజలకు అవగాహన కల్పించారు.


ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి ప్రభాకర్‌ మాట్లాడుతూ వంట గదిలో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలలో సూచనలు చేశారు. మంటలు వ్యాపిస్తే వాటిని ఆర్పే విధానాన్ని వివరించారు. వంటగదిలో కిరోసిన, పెట్రోల్‌ వంటి వాటిని ఉంచరాదన్నారు. అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు లిఫ్ట్‌ వాడకూడదని మెట్ల మార్గం ద్వారా కిందకు రావాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 17 , 2026 | 12:21 AM