మీడియాపై దాడి అప్రజాస్వామికం: టీడీపీ
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:14 AM
మీడియాపై దాడి అప్రజాస్వామికమని, మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏబీఎన ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీసీ గూండాలు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప, తెలుగు యువత కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి అన్నారు.
పరిగి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): మీడియాపై దాడి అప్రజాస్వామికమని, మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏబీఎన ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీసీ గూండాలు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప, తెలుగు యువత కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి అన్నారు.
మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏబీఎన ఆంధ్రజ్యోతి ప్రజల పక్షాన నిలబడి నిజాలను నిర్భయంగా చూపుతోందని, దీన్ని సహించలేని వైసీపీ గూండాలు ఆ సంస్థ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని అన్నారు. వీరికి ప్రజలే మళ్లీ తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్‌రావు, దొడ్డయ్య, రామాంజి, శివ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..