farewell day ఘనంగా ఫేర్‌వెల్‌డే
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:26 AM
పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫస్టియర్ విద్యార్థులు వీడుకోలు పలుకుతూ ఫేర్‌వెల్‌డేను ఘనంగా నిర్వహించారు.
పెనుకొండ, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫస్టియర్ విద్యార్థులు వీడుకోలు పలుకుతూ ఫేర్‌వెల్‌డేను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల హరీ్‌షబాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణగా కష్టపడి చదివి తల్లిదండ్రులు, గురువులు, ఊరికి, కళాశాలకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి అలరించారు. ఎనఎ్‌సఎ్‌స పీఓ ప్రతాప్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..