ఆస్పత్రే తరగతి గదిగా..చదువుకుంటున్న రాప్తాడు లక్ష్మి
ABN , Publish Date - Nov 28 , 2026 | 06:23 AM
కాలం కత్తి దూసినా ఆమె వెనక్కి తగ్గలేదు. విధి వెంటాడినా విద్యను వదిలిపెట్టలేదు. అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నతపాఠశాలలో ఉన్మాది దాడి నుంచి స్నేహితురాలిని కాపాడబోయి తీవ్రంగా గాయపడిన లక్ష్మి.. ఆస్పత్రిలోనే తన చదువును కొనసాగిస్తోంది.
స్నేహితురాలిని కాపాడే క్రమంలో తీవ్ర గాయాలు
నెల రోజులుగా ఆస్పత్రిలోనే టెన్త్ విద్యార్థిని
కాలం కత్తి దూసినా ఆమె వెనక్కి తగ్గలేదు. విధి వెంటాడినా విద్యను వదిలిపెట్టలేదు. అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నతపాఠశాలలో ఉన్మాది దాడి నుంచి స్నేహితురాలిని కాపాడబోయి తీవ్రంగా గాయపడిన లక్ష్మి.. ఆస్పత్రిలోనే తన చదువును కొనసాగిస్తోంది. ఈ ఘటనలో లక్ష్మి కాలుకు తీవ్రగాయం అయింది. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్సలు అందిస్తున్నారు. దీనివల్ల నెల రోజులుగా బడికి లక్ష్మి దూరమైంది. పరీక్షలు దగ్గర పడ్డాయి. దీంతో విలువైన విద్యా సంవత్సరం వృథా కాకూడదనే పట్టుదలతో, ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ వార్డునే తరగతి గదిగా మార్చుకుంది. గాయం తాలుకు నొప్పిని భరిస్తూనే పుస్తకాలు చేతబట్టి చదువుకుంటోంది. తన కూతురుకు తల్లి రమాదేవి పక్కనే ఉండి ధైర్యం చెబుతున్నారు.
- అనంతపురం వైద్యం, ఆంధ్రజ్యోతి
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..