Share News

అక్క ఎంపీపీ.. చెల్లి సర్పంచ్‌

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:04 AM

అనంతపురం జిల్లా కణేకల్లు మండలం కళేకుర్తి గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు, తోడికోడళ్లు కూడా అయిన హేమావతి, క్రిష్ణవేణి ఎంపీపీ, సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

అక్క ఎంపీపీ.. చెల్లి సర్పంచ్‌

  • అనంతలో తోడికోడళ్లకు పదవులు

కణేకల్లు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా కణేకల్లు మండలం కళేకుర్తి గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు, తోడికోడళ్లు కూడా అయిన హేమావతి, క్రిష్ణవేణి ఎంపీపీ, సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామానికి చెందిన వీరిద్దరూ కళేకుర్తి గ్రామానికి చెందిన అన్నదమ్ములను వివాహం చేసుకున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇద్దరికీ పదవులు దక్కాయి. టీడీపీ నాయకుడు కళేకుర్తి సుదర్శన్‌ సతీమణి హేమావతి మండల ఎంపీపీగా ఎన్నిక కాగా.. సుదర్శన్‌ తమ్ముడు ఎర్రిస్వామి భార్య క్రిష్ణవేణి కళేకుర్తి గ్రామానికి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ పదవులు రావడంతో అటు పుట్టినిల్లు, ఇటు మెట్టినింట్లో సంతోషాలు వెల్లివిరిశాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 05:06 AM