వివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారు జగనే
ABN , Publish Date - Sep 30 , 2026 | 05:15 AM
వివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారుడు జగనే అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ వివేకా హత్యపై జగన్, ఆయన అనుచరులు ఏయే సందర్భాల్లో ఎలా మాటమార్చారో వీడియోలతోసహా మంత్రి వివరించారు.
తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే హత్యకు ప్రణాళిక: మంత్రి అనగానివివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారుడు జగనే అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ వివేకా హత్యపై జగన్, ఆయన అనుచరులు ఏయే సందర్భాల్లో ఎలా మాటమార్చారో వీడియోలతోసహా మంత్రి వివరించారు. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న చందంగా తప్పులు చేస్తూ ఇతరులపై ఎదురుదాడికి దిగడం గొడ్డలి పార్టీ నాయకులకు నిత్యకృత్యంగా మారిందన్నారు. వివేకా హత్యకేసులో జగన్, జగన్ సతీమణి భారతి, జగన్ సోదరుడు అవినాశ్ రెడ్డి పేర్లు బయటకు వస్తున్నాయని, హత్యకు రూ.40 కోట్ల సుపారీ వెనుకున్న వాస్తవాలు బయటకు వస్తున్నాయని, వీటన్నింటికీ జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా వివేకా హత్యకు ప్రణాళిక జరిగిందన్నది సుస్పష్టమని అన్నారు.
తండ్రి చావు నుంచి శవాల మీద రాజకీయం చేయడం గొడ్డలి పార్టీ అధినేతకు అలవాటుగా మారిందన్నారు. వివేకా హత్యపై 2019 ఎన్నికల ముందు సీబీఐ విచారణ కావాలన్న జగన్, ఎన్నికల తర్వాత సీబీఐని ఎందుకు నమ్మలేదని ప్రశ్నించారు. అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయడానికి వచ్చిన సీబీఐ అధికారులపై ఎదురు కేసులు ఎందుకు పెట్టారని నిలదీశారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని, హత్యను గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వివేకాహత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, ఇప్పుడు దస్తగిరి, సునీల్‌యాదవ్ తమకు ప్రాణహాని ఉందని భయపడుతున్నారని అన్నారు. అధికారం, అవినీతి సంపదకోసం జగన్ ఎంతటి ఘోరానికైనా పాల్పడుతారని మంత్రి విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం