Share News

12, 13 తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:53 AM

విశాఖలో ఈ నెల 12, 13 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వరుసగా రెండో ఏడాది నిర్వహించనున్న సదస్సుకు వందకుపైగా దేశాల ప్రతినిధులు...

12, 13 తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు

విశాఖపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): విశాఖలో ఈ నెల 12, 13 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వరుసగా రెండో ఏడాది నిర్వహించనున్న సదస్సుకు వందకుపైగా దేశాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు. సదస్సులో పెట్టుబడులకు సంబంధించి భారీగా ఒప్పందాలు జరగనున్నాయని అంచనా వేస్తున్నారు.

సదస్సు ప్రారంభం రోజున కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ముగింపు కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ హాజరవుతారు. సీఎం చంద్రబాబు ఈ నెల 11వ తేదీన నగరానికి రానున్నారు. ఆరోజు రాత్రి సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు గాలా డిన్నర్‌ ఇవ్వనున్నారు. సదస్సు ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ శుక్రవారం విశాఖలో సమీక్ష నిర్వహించారు.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 04:53 AM