వైద్య నివేదికలు సమర్పించండి
ABN , Publish Date - Sep 26 , 2026 | 04:20 AM
ఏపీ మద్యం రవాణా టెండర్ల కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ మళ్లీ నోటీసు జారీచేసింది. సోమవారం(28న) హైదరాబాద్‌లో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. అయితే తాను ఇటీవలే గుండెకు స్టెంట్లు వేయించుకున్నానని..,.
మద్యం రవాణా కేసులో.. అంబటికి మళ్లీ ఈడీ నోటీసు
హైదరాబాద్, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఏపీ మద్యం రవాణా టెండర్ల కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ మళ్లీ నోటీసు జారీచేసింది. సోమవారం(28న) హైదరాబాద్‌లో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. అయితే తాను ఇటీవలే గుండెకు స్టెంట్లు వేయించుకున్నానని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నందున కోలుకున్నాక వస్తానని ఈమెయిల్ ద్వారా ఆయన బదులిచ్చారు. దీంతో ఈడీ ఆయన వైద్య నివేదికలు సమర్పించాలని అడిగినట్లు సమాచారం. వాస్తవానికి అంబటి గురువారమే ఈడీ ఎదుట హాజరవ్వాల్సి ఉంది. కానీ గుండెకు స్టెంట్లు వేయించుకున్న కారణంగా రాలేకపోతున్నట్లు ఆయన లేఖ రాశారు. శుక్రవారం తప్పనిసరిగా రావాలని ఈడీ అధికారులు చెప్పగా.. పూర్తిగా కోలుకున్న తర్వాతే వస్తానని అంబటి చెప్పినట్లు సమాచారం.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ