Share News

మావిగన్ ట్రోలింగ్ చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి: మంత్రి కందుల దుర్గేష్

ABN , Publish Date - Apr 04 , 2026 | 09:04 PM

మావిగన్ విషయంలో ప్రజలు చేస్తున్న ట్రోలింగ్ చూసైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

మావిగన్ ట్రోలింగ్ చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి: మంత్రి కందుల దుర్గేష్
Amaravati capital news

అమరావతి, ఏప్రిల్ 4: మావిగన్ విషయంలో ప్రజలు చేస్తున్న ట్రోలింగ్ చూసైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నాళ్లుగా సాగుతున్న సందిగ్ధతకు తెరపడిందని.. అమరావతే రాష్ట్ర శాశ్వత రాజధాని అయిందని తెలిపారు. రాజధాని అమరావతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గతంలోనే అసెంబ్లీ వేదికగా తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించారని గుర్తు చేశారు.

కందుల దుర్గేశ్ మాట్లాడుతూ.. ‘పార్లమెంట్‌లో రాజధానిపై చట్టం ఆమోదం పొందిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తమ అభిప్రాయాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నారు. అమరావతి విషయంలో వైసీపీ నేతలు తమ అక్కసు వెళ్లబోసుకుంటున్నారు. అందుకే ఇప్పటికీ అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. అమరావతికి ప్రజల మద్దతు ఉంది. మావిగన్ విషయంలో ప్రజలు చేస్తున్న ట్రోలింగ్ చూసైనా వైసీపీ నేతల బుద్ధి తెచ్చుకోవాలి’.. అని అన్నారు.


సినిమా పరిశ్రమకు అండగా కూటమి ప్రభుత్వం..

సినీ పరిశ్రమ అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో సినిమా షూటింగ్స్ నిర్వహించుకోవడానికి అవసరమైన అన్ని అనుమతులనూ ప్రభుత్వం సులభతరం చేస్తోంది. అంతేకాదు, ఏపీని షూటింగ్ హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. చిత్ర పరిశ్రమల ఆర్ధిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని.. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సినిమా రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాచర్ల అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్..

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ ఘన విజయం

Updated Date - Apr 04 , 2026 | 09:48 PM