అమరావతికి మరిన్ని నిధులు
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:34 AM
రాజధాని అమరావతి పరిధిలో చేపడుతున్న పనుల కోసం మరిన్ని నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
2027-46 మధ్య అంచనా వ్యయం 1,33,302 కోట్లు
అదే కాలానికి సమకూరే రాబడి 1,05,348 కోట్లు
గుంటూరు(రాజధాని), నవంబరు 17(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి పరిధిలో చేపడుతున్న పనుల కోసం మరిన్ని నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైన నిధులను ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వు(నెంబరు 1397)లు జారీచేసింది. దీనిలో అమరావతికి సంబంధించిన పలు వివరాలను వెల్లడించింది.
129 ప్రాజెక్టుల రూపకల్పన
అమరావతి సమగ్ర ఆర్థిక ప్రణాళిక 2026, మార్చి నాటి కి ఏపీసీఆర్డీఏ రూపొందించిన ఆర్థిక వ్యూహపత్రాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ పత్రం మేరకు అమరావతిలో ఇప్పటికే రూ.90,092 కోట్ల అంచనా వ్యయంతో 129 ప్రాజెక్ట్‌లను రూపొందించారని, వీటిలో రూ.41,062 కోట్ల వ్యయంతో 67 ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూర్చుకుంటున్నారని పేర్కొంది. మిగిలిన రూ.49,030 కోట్ల వ్యయంతో నిర్మించే 62 ప్రాజెక్ట్‌లకు ఇంకా నిధులు సమకూర్చవలసి ఉందని తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
వచ్చే ఆర్థిక సంవత్స రం 2027 నుంచి 2046 వరకు అమరావతి రాజధాని ప్రణాళిక అమలు కోసం రూ.1,33,302 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది. రాబడి విషయానికి వస్తే, అప్పులతోపాటు వేర్వేరు రూపాల్లో రూ.1,05,348 కోట్లు సమకూరే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇంకా రూ.27,954 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడుతుందని, పలు మార్గాల్లో నిధులు సమకూర్చుకోవాల్సి ఉందని వివరించింది. భూముల అమ్మకం, సొంత ఆదాయం పెంపు, రుణాలు, గ్రీన్ బాం డ్లు, పీపీపీ వంటి పద్ధతుల్లో నిధులు సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబరు 18న జరిగిన సీఆర్డీఏ 66వ అథారిటీ సమావేశంలో తీర్మానం(నెంబరు 721/2026) మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజధాని నగర సమగ్ర ఆర్థిక ప్రణాళికను పరిశీలించడానికి నలుగురు అధికారులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆర్థికశాఖ కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ మెంబరు కన్వీనరుగా ఉంటారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు