Share News

అమరావతిలో చకచకా జ్యుడీషియల్‌ అకాడమీ

ABN , Publish Date - Nov 24 , 2026 | 06:09 AM

అమరావతిలో అత్యాధునికి వసతులతో జ్యుడీషియల్‌ అకాడమీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అమరావతిలో చకచకా జ్యుడీషియల్‌ అకాడమీ

  • పిచుకలపాలెం రెవెన్యూలో రూ.165.33 కోట్లతో నిర్మాణం

తుళ్లూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో అత్యాధునికి వసతులతో జ్యుడీషియల్‌ అకాడమీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏజీఐసీఎల్‌ (అమరావతి గ్రోత్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) నిర్మాణ పనులు చేస్తోంది.పిచుకలపాలెం రెవెన్యూలో గ్రావెటీ కెనాల్‌ పక్కనే..పౌండేషన్‌ పనులు పూర్తి చేసుకొని గ్రౌండ్‌ ఫ్లోర్‌ పార్కింగ్‌ పనులు జరుగుతున్నాయి. 4.83 ఎకరాలను కేటాయించగా.. 2.05 లక్షల చదరపు అడుగుల విస్తీరణంలో రూ.165.33 కోట్లతో అకాడమీ నిర్మాణం చేపట్టారు. ఇందులో మూడు ప్రధాన భవనాలు, అకడమిక్‌ బ్లాక్‌, హాస్టల్‌ బ్లాక్‌, ఇండోర్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గెస్ట్‌ ఫెసిలిటీస్‌ బ్లాక్‌లు నిర్మాణం కానున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 06:11 AM