Share News

అమరావతిపై విషం చిమ్మేవారి తాటతీయాలి

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:57 AM

రైతుల త్యాగాలతో నిర్మితమవుతున్న ప్రపంచస్థాయి ప్రజా రాజధాని అమరావతిపై విషం చిమ్మేవారి తాటతీయాలని రాజధాని అమరావతి రైతులు డిమాండ్‌ చేశారు.

అమరావతిపై విషం చిమ్మేవారి తాటతీయాలి

  • సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిని అరెస్టు చేయాలి

  • రాజధానిలో రైతులు, మహిళల నిరసన ప్రదర్శన

  • తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

తుళ్లూరు, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): రైతుల త్యాగాలతో నిర్మితమవుతున్న ప్రపంచస్థాయి ప్రజా రాజధాని అమరావతిపై విషం చిమ్మేవారి తాటతీయాలని రాజధాని అమరావతి రైతులు డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో శనివారం రైతులు, మహిళలు ప్లకార్డులు, బ్యానర్‌తో ర్యాలీ నిర్వహించి, తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతిపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ కోవర్టులు సోషల్‌ మీడియా వేదికగా చేసుకుని అమరావతి రాజధానిపై సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై తప్పుడు పోస్టులు పెడుతున్నారన్నారు. ఆఖరికి చంద్రబాబు కట్టుకుంటున్న ఇంటిపై కూడా అసత్య ప్రచరాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్‌ మీడియా గ్రూపుల్లో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఐ కొంకా శ్రీనివాసరావుకు రైతులు, టీడీపీ నేతలు వివరించారు. సోషల్‌ మీడియా గ్రూపు అడ్మిన్‌లను విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షడు ధనేకుల సుబ్బారావు, టీడీపీ, తెలుగు యువత, దళిత, మైనార్టీ జేఏసీ నేతలు, మండల మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 01:00 AM