Share News

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశం

ABN , Publish Date - Apr 23 , 2026 | 08:50 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. సమావేశం సందర్భంగా రాజధాని నిర్మాణంలో వివిధ ప్రతిపాదనలపై చర్చ జరిగింది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశం
Amaravati capital development

అమరావతి, ఏప్రిల్ 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. సమావేశం సందర్భంగా రాజధాని నిర్మాణంలో వివిధ ప్రతిపాదనలపై చర్చ జరిగింది. హరిత, నీలి నగరంగా రాజధాని నిర్మాణం జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీపై మళ్లీ పెట్టుబడిదారులకు విశ్వాసం పెరిగిందని చెప్పారు. రాజధానిని అనుసంధానిస్తూ కృష్ణానదిపై.. ఐకానిక్‌గా బ్రిడ్జి నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.


సీఎం చంద్రబాబుతో బిట్స్‌ పిలాని ప్రతినిధుల సమావేశం

సీఎం చంద్రబాబుతో బిట్స్‌ పిలాని ప్రతినిధులు గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజధానిలో బిట్స్ పిలాని క్యాంపస్ పురోగతిపై చర్చ జరిగింది. క్యాంపస్‌లో క్వాంటం, ఏఐ విభాగాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు బిట్స్ పిలాని ప్రతినిధులు తెలిపారు. 2027 నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తామని తెలిపారు. మూడు దశల్లో బిట్స్ పిలాని అమరావతి క్యాంపస్‌ నిర్మాణం ఉంటుందన్నారు. 10 వేల మంది విద్యార్థులు చదువుకునేలా క్యాంపస్ నిర్మాణం ఉంటుందని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

ఆర్టీసీ సమ్మెలో ఆందోళనకర పరిణామాలు..

చిన్న నౌకలనూ కాల్చేయండి.. అమెరికా నేవీకి ట్రంప్ కీలక సూచనలు

Updated Date - Apr 23 , 2026 | 09:14 PM