రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. భూ కేటాయింపులపై నిర్ణయం..
ABN , Publish Date - Feb 23 , 2026 | 09:38 PM
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంగళవారం సమావేశం కానుంది. సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది.
అమరావతి, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రేపు (మంగళవారం) సమావేశం కానుంది. సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపనుంది. సీఆర్‌డీఏ ప్రతిపాదనల్లో ఆర్ 5 జోన్ కీలక అంశంగా ఉండనుంది. గత ప్రభుత్వం ఆర్ 5 పేరుతో రాజధాని ప్రాంతంలో బయట నుంచి తీసుకువచ్చి తమ అనుచరులకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. దీంతో రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌కు ఇబ్బంది వస్తుందని సీఆర్‌డీఏ భావిస్తోంది.
తమ సొంత ప్రాంతాలకు సుదూరంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తే పేదలకు ఉపయోగం ఉండదని భావించింది. రాజధాని అమరావతిలో R 5 జోన్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. R 5 జోన్‌లో గత ప్రభుత్వం వేసిన లే-ఔట్లు, భూ పంపణీనీ సీఆర్‌డీఏ రద్దు చేసింది. గత ప్రభుత్వ హయాంలో విజయవాడ, గుంటూరులో సుమారు 50 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. R 5 జోన్ వలన మొత్తం రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌కు ఇబ్బంది కలిగించాలని గత ప్రభుత్వం చూసింది.
ఈ ప్రతిపాదనకు అడ్డు చెప్పిన 420 మంది రైతులపై అప్పట్లో జగన్ సర్కార్ కేసులు సైతం నమోదు చేసింది. ఈ ఇళ్ల స్థలాల కేటాయింపును రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. తిరుమల లడ్డు, కల్తీ పాలపై ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
పవన్ కల్యాణ్ చొరవ.. ఏలూరు జిల్లాలో దశాబ్దాల సమస్యకు పరిష్కారం..
పాక్, అమెరికా కరెన్సీతో సరిహద్దుల్లో బెలూన్ల స్వాధీనం