‘జీఎంఆర్’తో ఎయిర్ ఇండో ఎయిర్‌లైన్స్ జోడీ
ABN , Publish Date - Nov 28 , 2026 | 06:30 AM
రాజధాని అమరావతి నుంచి 2027 మేలో ప్రారంభించనున్న నూతన ఎయిర్ ఇండో ఎయిర్‌లైన్స్ తన సన్నాహాలను ముమ్మరం చేసింది.
విజయవాడ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నుంచి 2027 మేలో ప్రారంభించనున్న నూతన ఎయిర్ ఇండో ఎయిర్‌లైన్స్ తన సన్నాహాలను ముమ్మరం చేసింది. ఈ సంస్థ తమ విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాలింగ్ సేవల కోసం హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్ సహకారం తీసుకోనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌వోఐ) ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా శుక్రవారం ఎయిర్ ఇండో సీఈవో శ్రీనివాస్ చిలుకూరి హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్ సెంటర్‌ను సందర్శించారు. సంస్థ పనితీరు, సాంకేతిక సేవలు, విమాన నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..