నగర పంచాయతీ వద్దు పంచాయతీ చాలు
ABN , Publish Date - Nov 15 , 2026 | 01:38 AM
‘మీ కాళ్లు పట్టుకుంటాం... నామినేషన్లు వేయకండి.’ అంటూ అన్ని రాజకీయ పార్టీలు.. అభ్యర్థులను వేడుకుంటున్నాయి. రెండో విడత మున్సిపల్ ఎన్నికల్లో...
అల్లూరులో ఏకమైన రాజకీయ పార్టీలు
నామినేషన్లు పడకుండా కాపలా కాస్తున్న వైనం
అల్లూరు, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘మీ కాళ్లు పట్టుకుంటాం... నామినేషన్లు వేయకండి.’ అంటూ అన్ని రాజకీయ పార్టీలు.. అభ్యర్థులను వేడుకుంటున్నాయి. రెండో విడత మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నెల్లూరు జిల్లా అల్లూరు నగర పంచాయతీలో శనివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. అయితే, పట్టణవాసుల అభిప్రాయానికి విరుద్ధంగా గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా మార్పు చేసినందుకు నిరసనగా రాజకీయ పక్షాలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయి.
ఎవరూ నామినేషన్ దాఖలు చేయకుండా నామినేషన్ కేంద్రం వద్ద నాయకులు కాపలా కాశారు. అల్లూరు, సింగపేట, నార్తుమోపూరు నాయకులు, ప్రజలు ఏకతాటిపైకి వచ్చి ఈ నిరసనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆ మూడు గ్రామాల ప్రజలు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియను ఆపేసేందుకు నామినేషన్లను వేయనీయకుండా చేయడమే సరైందన్నారు. దీంతో నామినేషన్ల ప్రక్రియలో తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం