ఎయిర్ ఇండో.. కేరాఫ్ ఏపీ!
ABN , Publish Date - Nov 22 , 2026 | 02:42 AM
రాష్ట్రం నుంచి కొత్త విమానయాన సంస్థకు అంకురార్పణ జరిగింది. ‘ఎయిర్ ఇండో’ ఎయిర్‌లైన్స్‌కు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ కానుంది!
రాష్ట్రంలో కొత్త విమానయాన సంస్థకు అంకురార్పణ
390 కోట్ల ప్రణాళికతో ‘ఎయిర్ ఇండో’ ఎయిర్ లైన్స్
మే నెలలో ప్రారంభం.. 10 విమానాలతో కార్యకలాపాలు
ఎయిర్ ఇండో సీఈవో శ్రీనివాస్ చిలుకూరి వెల్లడి
విజయవాడ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి కొత్త విమానయాన సంస్థకు అంకురార్పణ జరిగింది. ‘ఎయిర్ ఇండో’ ఎయిర్‌లైన్స్‌కు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ కానుంది! వచ్చే ఏడాది మే నుంచి దీని సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల కేం ద్రంగా తెలంగాణలోని హెదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు మార్గాలకు విమాన సర్వీసులు నడిపేందుకు ఎయిర్ ఇండో కార్యాచరణను సిద్ధం చేసింది. తొలి దశలో ఐదు, మలి దశలో మరో ఐదు విమానాలతో కార్యకలాపాలు నిర్వహించబోతోంది. గుంటూరులో ఎయిర్ ఇండో ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానుంది. గుంటూరు జిల్లాకు చెందిన యువ పారిశ్రామికవేత్త శ్రీనివాస్ చిలుకూరి ఈ ఎయిర్‌లైన్స్ సంస్థను ప్రారంభించారు.
రూ.390 కోట్ల పెట్టుబడి ప్రణాళికతో రంగంలోకి దిగినట్టు శ్రీనివాస్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఎయిర్ ఇండో ఎయిర్‌లైన్స్ ఇప్పటికే రెండు విమానాలను కొనుగోలు చేసింది. మరొకటి డెలివరీ కావాల్సి ఉంది. ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఏటీఆర్ 72-600 విమానాలను ఈ సంస్థ ప్రవేశపెడుతోంది. పౌరవిమానయాన శాఖ, డీజీసీఏ తదితర సంస్థలకు ఇప్పటికే అనుమతుల కోసం ఎయిర్ ఇండో దరఖాస్తు చేసింది. విమానాలు డిసెంబరు నాటికల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని, అన్ని రకాల అనుమతులు ఈ లోపే రానున్నట్టు తెలుస్తోంది. ఏపీలోని యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించబోతోంది.
ఈ వార్తలనూ చదవండి:
బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?
కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి
ఈ వార్తలనూ చదవండి:
బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?
కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి