పంటల బీమాకు ఈకేవైసీ తప్పనిసరి: అగ్రి డైరెక్టర్
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:06 AM
తుఫాన్‌కు దెబ్బతిన్న పంటలకు బీమా అర్హత కోసం ఈ-పంటలోని ఈకేవైసీ ధ్రువీకరణ తప్పనిసరి అని వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ తెలిపారు.
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌కు దెబ్బతిన్న పంటలకు బీమా అర్హత కోసం ఈ-పంటలోని ఈకేవైసీ ధ్రువీకరణ తప్పనిసరి అని వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ తెలిపారు. ఇందుకోసం రైతుల ఈకేవైసీని త్వరితగతిన పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులను శనివారం ఆయన ఆదేశించారు. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టంపై ఎన్యూమరేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు. పంటల బీమా క్లైముల అర్హతకు రైతుల ఈ-పంటలోని వివరాలను ధ్రువీకరిస్తూ, ఈకేవైసీ చేయాలని సూచించారు. నవంబరు 2వ తేదీ నుంచి ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ కారణంగా రాజకీయ ప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!