ముందస్తు చర్యలతో పంటలకు రక్షణ
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:16 AM
అక్వాన్ తుఫాను సంసిద్ధతపై మంగళవారం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.సత్యనారాయణ శాస్త్రవేత్తలతో సమీక్ష జరిపారు. తుఫాను నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రైతులకు అగ్రి వర్సిటీ సూచనలు
అక్వాన్ తుఫాను సంసిద్ధతపై మంగళవారం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.సత్యనారాయణ శాస్త్రవేత్తలతో సమీక్ష జరిపారు. తుఫాను నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ‘కోతకు సిద్ధంగా ఉన్న ఖరీఫ్ వరిని వెంటనే కోసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. రబీ సాగుకు సిద్ధంగా ఉన్న పొలాల్లో మురుగునీటిని మళ్లించేందుకు కాలువలు సిద్ధం చేసుకోవాలి. వర్షాల సమయంలో ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయకూడదు. ఎరువులు, పురుగుమందులు భద్రం చేసుకోవాలి. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గి, నేల అనుకూల స్థితికి వచ్చాకే రబీ పంటల విత్తనాలు వేయాలి. మొక్కజొన్నలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. వరి, రాగి, కొర్ర నారుమడుల చుట్టూ మురుగునీటి కాలువలు చేసుకోవాలి. తుఫాను తర్వాత పొలాల్లో నిలిచిన నీటిని 48 గంటల్లో పూర్తిగా తొలగించాలి. పత్తి చేలల్లో నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపాలి. ప్రస్తుతం శనగ పంట మొలకెత్తే దశలో ఉన్నందున వేరుకుళ్లు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు