Share News

నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం.. మదనపల్లి బాలిక హత్యపై హోంమంత్రి స్పందన..

ABN , Publish Date - Feb 17 , 2026 | 09:35 PM

అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు కారకుడైన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామని ఏపీ హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులతో హోంమంత్రి మాట్లాడారు. తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం.. మదనపల్లి బాలిక హత్యపై హోంమంత్రి స్పందన..
Madanapalle girl case

అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలో ఏడేళ్ల బాలిక దారుణ హత్య కేసుకు కారకుడైన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామని ఏపీ హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులతో హోంమంత్రి మాట్లాడారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చారు (Madanapalle girl case).


మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీతోనూ మాట్లాడారు. కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని పోలీసులను ఆదేశించారు.


ఈ కేసులో మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది (Andhra Pradesh crime news). బాలికను హత్య చేసే ముందు నిందితుడు ఆమెపై లైంగిక దాడికి కూడా పాల్పడినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తేలిందని రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. నిందితుడిపై పోక్సో కేసు కూడా నమోదవుతుందని ఆయన వెల్లడించారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా కేసును ముందుకు తీసుకు వెళ్తామన్నారు. పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని బాలిక స్వగ్రామానికి తరలించినట్లు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

భర్తను అమ్మేసిన భార్య.. అతడి ప్రియురాలి దగ్గర్నుంచి ఎంత డబ్బు వసూలు చేసిందంటే..


లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

Updated Date - Feb 17 , 2026 | 10:02 PM